సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: నేడు, మంగళవారం పశ్చిమ గోదావరి` తణుకు పట్టణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఆయన సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామనిఅన్నారు. ‘ఇప్పటి వరకు 31లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశాం. చరిత్రలో కనీవినీ ఎరగని విధంగా సొంతింటి కల నెరవేరుస్తున్నాం. 50 లక్షల మంది కుటుంబాలకు మంచి జరిగే రోజు ఇది. ఇల్లు అంటే ఇటుకలు, స్టీలుతో కట్టిన కట్టడం కాదు. సుదీర్ఘకాలం పడిన కష్టానికి ప్రతిరూపం ఇల్లు’ అని అన్నారు. ఈ సందర్భముగా వేదికపై సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారు సుజాత మాట్లాడుతూ.. ‘ఈ పథకం పెట్టినందుకు మీకు ధన‍్యవాదాలు అన్న. 9 ఏళ్ల క్రితం నేను ఇళ్లు కట్టుకున్నా అయితే ఇప్పటిదాకా ఇంటికి సంబంధించి నాకు ఎటువంటి ఇంటి పత్రం లేదు. ఇప్పుడు ఈ పథకం క్రింద దాదాపు పది లక్షల రూపాయల ఆస్తిని నా చేతిలో పెడుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉందన్నా అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *