సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో అరకు తో సహా గిరిజన ఏజెన్సీ ప్రాంతాలలో ఎన్ని సార్లు ఎన్నికలు జరిగిన అక్కడ ప్రజలు వైసీపీ కి ఎక్కువ స్థానాలలో పట్టం కడతారు. ప్రస్తుత అరకు ఎంపీ కూడా వైసీపీనే .. దీనితో ఇటీవల కొంత సోషల్ మీడియాలో గిరిజనులు ఫై ఇకపై టీడీపీ మెతక ధోరణి ఉండదని గిరిజన చట్టంలో మార్పులు తెస్తారని వస్తున్నా వార్తలను సీఎం చంద్రబాబు నేడు, మంగళవారం ఖండించారు. మీడియాతో మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లోని ఆస్తులపై గిరిజనులకే హక్కు ఉండాలన్న ఆలోచనతో వచ్చిన 1/70 చట్టాన్ని మార్చే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని, అలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అన్నారు. అనవసరమైన అపోహలతో కలత చెందవద్దని గిరిజన సోదరులను కోరుతున్నానని అన్నారు. గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని, గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేనని తాము బలంగా నమ్ముతున్నామని చెప్పారురాష్ట్రంలోనే జీవో నెం.3ని తీసుకురావడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకు మాత్రమే దక్కేలా కృషి చేశామని అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *