సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాలలో స్థానికంగా ఒక హిజ్రాతో కొడుకు ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని తెలిసిన తల్లిదండ్రులు అవమానంతో ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తాజగా నేడు, గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. SBI కాలనీలో సుబ్బరాయుడు, సరస్వతి దంపతుల కొడుకు సునీల్ బీటెక్ ఫస్టియర్ ఫెయిలై ఆటో డ్రైవర్లతో తిరుగుతున్నాడు.ఇటీవల అతను ఓ హిజ్రాతో చనువుగా ఉంటున్నాడని తల్లి తండ్రులు మందలించారు. ఈ క్రమంలో స్థానిక హిజ్రా గ్యాంగ్ తమదైన తీరుతో తల్లి తండ్రులు షాపు వద్దకు వచ్చి బూతులు తిడుతూ అవమానకరంగా ప్రవర్తించారు. దీంతో అవమానం భరించలేక తల్లిదండ్రులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో అక్కడే ఉన్న స్థానికులు వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ లాభం లేకపోయింది.. అప్పటికే పరిస్థితి విషమించడంతో దంపతులిద్దరూ మృతి చెందారు.
