సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్; పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో తీవ్ర విషాదం నిండుకొంది. గత రాత్రి స్థానిక రాజంచెరువు సమీపంలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మరణించాడు. 80 శాతం తీవ్ర గాయాలపాలైన మరొక వ్య క్తిని మెరుగైన చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం తరలించారు. ఈ కేంద్రం లో బాణసంచాను ఓ వాహనం లోకి లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తయారీ కేంద్ర నిర్వాహకుడుగా చెబుతున్న పండూరి అన్నవరం పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పా రు. ఘటనా స్థలాన్ని డిప్యూటీ సీఎం , కొట్టు సత్యనారాయణ, ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు, ఏలూరు ఎస్పీ రాహుల్దేవ్ శర్మ ఘటనా స్థలాన్ని సందర్శించారు సహాయక చర్యలను పర్యవేక్షించారు. తదుపరి, కొట్టు సత్య నారాయణ మాట్లాడుతూ.. తాను గడపగడపకుకార్యక్రమంలో ఉండగా సమాచారం తెలిసిందని.. వెంటనే అధికారులను హుటాహుటిన ఘటనాస్థలానికి పంపించి సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలుతీసుకుంటామని..క్షతగాత్రులకు ఏరియా ఆస్ప త్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకొంటామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *