సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాతాడేపల్లిగూడెం స్థానిక SBI బ్యాంకు లో ఖాతాదారుడి ఖాతాలోని రూ.42 లక్షలు మాయం చేసిన కేసులో దుండగులకు వారికి లోపాయకారిగా సహకరిం చిన ఇద్దరు బ్యాంకు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ బండారు శ్రీనాథ్ తెలిపారు. తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను ప్రకటించారు. వివరాలలోకి వెళ్ళితే.. స్థానిక సుబ్బారావుపేటకు చెం దిన ఇ.నరసింహారావు తాడేపల్లిగూడెం ఎస్బీఐ ప్రధాన శాఖలో రూ.43 లక్షలను తన ఖాతాలో వేసుకొన్నారు. ఆయన ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో పుట్టపర్తిలోని సాయి సన్నిధికి వెళ్లి తిరిగి జులైలో వచ్చా రు. బ్యాంకుకు వెళ్లి ఖాతాలో నగదు చూడగా రూ.లక్ష మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఆందోళన చెందిన బాధితుడు పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా వారు చేసిన దర్యాప్తులో అన్నమయ్య జిల్లా గాలివీడు బ్రాంచిలో అసిస్టెంట్ మేనేజరుగా పని చేస్తున్న అప్పలరాజు పవన్ కుమార్, అదే బ్రాంచిలో క్లర్కు గా విధులు నిర్వర్తిస్తున్న పూసపూటి వెంకట నవీన్ కుమార్లు దోషులకు కు సాంకేతికంగా సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. దీనితో ఆర్బీఐ నిబంధనల మేరకు బాధితుడు నష్టపోయిన రూ.42 లక్షల ను SBI తిరిగి చెల్లించినట్లు డీఎస్పీ ప్రకటించారు. .
