సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాడేపల్లి గూడెం డివిజన్ పరిధిలోని డీఎస్పీ, మూర్తి తణుకు పోలీసు స్టేషన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల తాడేపల్లిగూడెం టౌన్, రూరల్ పోలీసు స్టేషన్లతోపాటు తణుకు టౌన్, రూరల్ పోలీసు స్టేషన్ల పరిధిలో జరిగిన ఇళ్ల దోపిడీలకు, దారిదోపిడీలకు సంబంధించి మొత్తం ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి సుమారు 12 లక్షలు విలువైన 154 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకొన్నట్లు ప్రకటించారు. దేవరపల్లి మండలం త్యాజంపూడి గ్రామానికి చెందిన గనసాల దుర్గాప్రసాద్, తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన లకవరపు వెంకటాచారి, గణపవరం మండలం గరగ శివకృష్ణ, పంజా శ్రీనివాసరావు, మరియు ఉంగుటూరు మండలం అక్కుపల్లిగోపవరం గ్రామానికి చెందిన ఆకుల రమేష్లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో తణుకు పట్టణ, రూరల్ సీఐలు నాగరాజు, నాగేశ్వరరావు, తాడేపల్లిగూడెం సీఐ సూర్య నారాయణ, ఎస్సై లు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *