సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం హాట్ టాపిక్ నరసాపురం ఎంపీ టికెట్ రఘురామా కృష్ణంరాజు కూటమిలో ఏ పార్టీ ఇవ్వలేదని.. తాను వైసీపీ టికెట్ ఫై గెలిచినప్పటికీ కారణాలు ఏవైనా అదే పార్టీకి రెబల్ గా మారి గత 4న్నర ఏళ్లుగా అదే పార్టీ ఎంపీగా కొనసాగుతూ.. విమర్సలు, ఆరోపణలు చెయ్యడంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర ను పోషించారు. ..మొదటిలో ఇసుక లో అవినీతి అంటూ మంచి ప్రశ్నలు వేసిన.. రానురాను ప్రతి విషయాన్ని అదేపనిగా ప్రతి రోజు రచ్చబండ చేస్తూ టీడీపీ జనసేన బీజేపీ చెయ్యలేని సాహసాలు చేస్తూ జగన్ సర్కార్ కు, ఆయనను అబిమానించేవారికి కూడా విసుగు కలిగించారు. సీఎం జగన్ ను అధికారంలోనుండి దించడమే ద్యేయంగా టీడీపీ జనసేన కూటమితో బీజేపీ ని జత కట్టించడంలోఢిల్లీ వేదికగా తనదయిన పాత్ర పోషించిన రఘురామా కు ఆఖరికి టికెట్ ఇవ్వక రిక్త హస్తం చూపించడం .. ఆయా కూటమికి చెందిన పార్టీలలోని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై గత రాత్రి మీడియాలో రఘురామా మాట్లాడుతూ.. తనకు టికెట్ రాకపోవడానికి సీఎం జగన్ చేసిన కుట్రే కారణం అని బీజేపీలో కొందరు పెద్దలు ఆయనకు సహకరించారని తన తాత్కాలిక పరాజయాన్నిఅంగీకరిస్తున్నానని మాట్లాడటంతో ఆయన అభిమానులే విస్తుపోతున్నారు. ఎన్నో విభేదాలు ఉన్నపటికీ కూటమిని కలపడానికి కోసం రాజుగారు ఎంత చేసారు? మరి కూటమి లో ఏ పార్టీ ఆయనకు ఎందుకు టికెట్ ఇవ్వటం లేదు? బీజేపీ ఇవ్వకపోతే మిగతా టీడీపీ జనసేన ఎందుకు ప్రక్కన పెట్టాయి? నిజానికి రాజు గారుతన టైం బాగోలేనప్పుడు కొత్తగా మరల కూటమితో గొడవ ఎందుకులే? అని ఊరుకొన్నారు కానీ? లేకపోతేనా ? ఎన్నో కష్టాలు పడితే ఇదా ప్రతిఫలం..? ఆయన సీఎం జగన్ ఫై ద్వేషంతో చేసిన కొన్ని వ్యాఖ్యలు కొన్ని వర్గాల ప్రజలకు ఇబ్బంది కలిగించాయి. సీఐడీ అధికారులు ఆయనపై కేసులు నమోదు చేశారు. అరెస్టు భయంతో నియోజకవర్గానికి ఏళ్లతరబడి దూరంగా ఉండి పోయారు. ఇప్పటికి నిరూపితం కాకపోయినా.. తన పుట్టినరోజున గుంటూరుకు తీసుకెళ్లి పోలీసులతో కొట్టించారని రఘురామా అనేక సందర్భాల్లో వాపోయారు. ఇటీవల తాడేపల్లెగూడెంలో జరిగిన కూటమి సభలో తానే ఇక్కడి నుంచి మరోసారి పోటీ చేస్తున్నట్టు బహిరంగంగా చంద్రబాబు పవన్ సాక్షిగా ప్రకటించారు.వారు ముసిముసిగా నవ్వుకొన్నపుడే ‘ఎదో తేడా’ కొడుతుందని జనం అర్ధం చేసుకొన్నారు. కానీ రఘురామరాజు కి అర్ధం కాలేదు.. బీజేపీ ఇవ్వకపోతే, టీడీపీ తరపున ఏదో ఒక నియోజకవర్గం నుంచి టికెట్ ఇప్పించుకునే అవకాశం చంద్రబాబు ఇప్పటికి ఉంది కదా? ఏది ఏమైనా రఘురామా తన దురదృష్టానికి జగన్ కారణం అని చెప్పడం వల్ల ఎవరి సానుభూతి రాదు.. ఇంకా అవకాశాలకు సమయం ఉంది కూటమిలోనే మార్గాలు అన్వేషించడం ఉత్తమం.. సిగ్మా ప్రసాద్ కాలమ్స్..
