సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తిరుపతి లోని పవిత్ర తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాలు బ్రోచర్‌ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నేడు, సోమవారం ఉదయం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ.. నవంబరు 10 నుంచి 18 వరకు తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. ఈనెల 7 తేదీ అంకురార్పణ, 9వ తేదీ లక్ష కుంకుమ పూజ నిర్వహణ ఉంటుందని తెలిపారు. 10వ తేదీన ధ్వజారోహణంతో శ్రీపద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని.. 14వ తేదీ అమ్మవారు గజవాహనంపై భక్తులకు దర్శనం ఇస్తారని తెలిపారు. 18 వతేది పంచమి తీర్థం ఉంటుందన్నారు. 9 కోట్ల రూపాయలతో తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ పుష్కరిణిని అభివృద్ధి చేస్తున్నామన్నారు
