సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తిరుపతి సమీపంలో నేటి సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో 10 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి చెన్నై జాతీయ రహదారిలోని నగరి ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది. నగరి నుంచి తిరుపతికి వెళుతున్న ఒక ప్రైవేటు బస్సు.. ఓ ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసి దాటుతున్న సమయంలో అకస్మాత్తుగా ఎదురుగా ఓ లారీ ఢీకొట్టుకుంటూ వెళ్లింది. వేగంగా ఢీకొనడంతో బస్సులో వెనుకనుండి ఒకవైపు కూర్చున్న ప్రయాణికులే తీవ్ర స్థాయిలో గాయాలు పాలయ్యారు. వారిలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందిగా మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో వడమాలపేట మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన పార్థసారథి, రాజేంద్ర నాయుడు తోపాటు తిరుపతికి చెందిన 8 ఏళ్ల మణికంఠ తో పాటు 60 ఏళ్ల వయసున్న మరో వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించారు. అయితే ఇంకా తమిళనాడుకు చెందిన చిన్నమలై పరిస్థితి విషమంగా ఉండగా.. క్షతగాత్రులను నగరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
