సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి లో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. లక్షలాది భక్తుల నోట ‘గోవింద’ నామాలతో తిరుమల గిరులు ప్రతిధ్వనిస్తున్నాయి. ఇక శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. డిసెంబర్ నెలలో మూడు రోజులకు సంబంధించిన రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల విడుదలను టీటీడీ వాయిదా వేసింది. డిసెంబర్ 29, 30, డిసెంబర్ 31వ తేదీలకు (వైకుంఠ ద్వార దర్శనం) సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం , శ్రీవాణి బ్రేక్ దర్శనాలకు సంబంధించిన టిక్కెట్లను అనివార్య కారణాల వలన విడుదల చేయడం లేదని టీటీడీ తెలిపింది. సవరించిన షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *