సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ఇంటర్నేషనల్ లయన్స్ డైరెక్టర్ లయన్స్ క్లబ్ కు చెందిన పి సుభాష్ బాబు పుట్టినరోజు సందర్భంగా తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ వారికి 4 సిమెంట్ బల్లలను, 100 నోట్ పుస్తకాలను ఉచితంగా అందించారు. అలసటతో ఉన్న పెన్షన్ దారులు సేద తీరేందుకు సిమెంట్ బల్లలు ఎంతో ఉపయోగపడతాయని లయన్స్ రీజినల్ చైర్ పర్సన్ లయన్ వివి కృష్ణంరాజు, క్లబ్ అధ్యక్షులు లయన్ బొండా రాంబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో తటవర్తి బదరీ, నడింపల్లి మహేష్ , అల్లు తులసి ప్రసాద్, కనకర్ల రామకృష్ణ, , గోపిశెట్టి మురళి, నందమూరి రాజేష్, డా పులగం మధు, బొండాడ కుమార్,భట్టిప్రోలు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
