సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల లో శ్రీవారి దర్శనం కోసం .. పిల్లలకు వేసవి సెలవులు నేపథ్యంలో కుటుంబ సమేతంగా వస్తున్నా వేలాది భక్తుల రద్దీ రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో దీంతో భక్తులు అసౌకర్యం గురి కాకుండా టీటీడీ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంచినీరు, పాలు, అల్పాహారం లాంటి వాటిని టీటీడీ భక్తులకు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందులో భాగంగానే ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారంలో విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఎలాంటి సిఫారసు లేఖలను కూడా స్వీకరించబోమని టీటీడీ అధికారులు తెలిపారు.ఈ రూల్స్ తక్షణం అమల్లోకి తీసుకురాబోతున్నట్లు అధికారులు తెలిపారు. జూన్ 30వ తేదీ వరకు ఈ రూల్స్ కొనసాగుతాయని అధికారులు తెలిపారు. కేవలం సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారాల్లో మాత్రమే విఐపి బ్రేక్ దర్శనం అందుబాటులో ఉండనుంది.
