సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు. శ్రీ వేంకట్వేశ్వర స్వామివారి భక్తుల మనోభావాలు, ఆచారాలకు భిన్నంగా ఏ ఒక్కరూ వ్యవహరించొద్దని ఆయన నేడు, శుక్రవారం ట్వీట్ చేశారు.” కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువులకు అతిపెద్ద పుణ్యక్షేత్రం. ఈ దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ఏడుకొండలవాడి పవిత్రతను కాపాడేందుకు, భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు మా ప్రభుత్వం ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపైనా ఉంది, టీటీడీ నిబంధనలు తప్పకుండా పాటించాలని కోరుతున్నా. భక్తుల మనోభావాలకు, ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః” అంటూ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *