సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు, సోమవారం రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. గత ఆదివారం విజయవాడ మరియువిశాఖలోని నేవిడే వేడుకలకు హాజరైన అనంతరం గత రాత్రి 8 గంటలకు తిరుమలకు చేరుకొన్నారు. నేటి సోమవారం ఉదయం రాష్ట్రపతి ముర్ము, శ్రీవారిని ఆలయ మర్యాదలతో దర్శించుకున్నారు. అక్కడ రంగనాయకులు మండపంలో రాష్ట్రపతికి వేదపండితులు వేదాశీర్వచనం ఇచ్చారు.తదనంతరం రాష్ట్రపతికి శ్రీవారి తీర్థప్రసాదాలు, స్వామి వారి చిత్రపటాన్ని వైవి సుబ్బారావు,అధికారులు అందజేశారు. మంత్రులు కొట్టు సత్యనారాయణ, రోజా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత పద్మా వతి అతిధి గృహానికి వచ్చి కొద్దీ విరామం తరువాత తిరుపతిలోని పద్మా వతి మహిళా విశ్వ విద్యాలయంలోని విద్యార్థులతో భేటీ అయ్యారు.
