సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లలను భక్తుల కోసం ఈనెల 12న విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఆరోజు ఉదయం 10 గంటలకు.. 2023 కొత్త ఏడాది జనవరి మాసం కోటా టికెట్లను విడుదల చేయనున్నారు. ఈనెల 12 ఉదయం 10 నుంచి 14వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు భక్తులకు అవకాశం కల్పించారు. అలాగే 14వ తేదీ మధ్యాహ్నం డిప్ ద్వారా భక్తులకు సేవా టిక్కెట్లు టీటీడీ కేటాయిస్తారు.
