సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ శ్రీరామునిగా.. బాలీవుడ్ నటి కృతి సనన్ సీతగా గా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్ 16న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను తిరుమల శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో, గత మంగళవారం రాత్రి వైభవంగా ఆధ్యాత్మిక మేళవింపుతో లక్షమంది అభిమానుల మధ్య నిర్వహించారు. ముఖ్య అతిధి ,ఆధ్యాత్మిక గురు చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ… జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్…డియర్ భగవత్ బంధువులారా.. సినిమా రంగంలో చరిత్ర సృష్టించిన మహనీయులు ఉండే ఇలాంటి కార్యక్రమాల్లో మాలాంటి వాళ్లు పాల్గొనడం ఇదే మొదటిసారి. దానికి కారణం ఏమిటి అంటే.. బాహుబలి .. నిజమైన బాహుబలి శ్రీ రాముడు అని లోకానికి నిరూపించడానికే… ఈ వేళ ప్రతి వ్యక్తిలోనూ రాముడు ఉన్నాడు.. శ్రీమాన్ ప్రభాస్ తనలోంచి రాముడిని ఈ సినిమా ద్వారా బయటకు తీసుకొస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మానవజాతికి సరైన దారి చూపించాల్సింది శ్రీరామచంద్రుడే. మానవజాతికి ఆదర్శవంతమైన పురుషుడు ఆయన జీవనాన్ని ఇప్పటి తరానికి నచ్చేలా మంచి టక్నాలజీ ఉపయోగించి సినిమా తీసేలా వీరిని శ్రీరాముడు ప్రేరేపించారు. వీరందరికి మంగళ అస్సిసులు.. అన్నారు. హీరో ప్రభాస్ మాట్లాడుతూ.. శ్రీ రామాయణం మేము సినిమా తియ్యడం మా అదృష్టం అని చిరంజీవి అన్నారు. ఇక శ్రీ రాముని పాత్ర పోషించడం నా అదృష్టం గా భావిస్తున్నాను. నా అభిమానుల అంచనాలను అందుకునేలా దర్శకుడు ఓం రావత్ నాతో 20 ఏళ్ళు పాటు పనిచేసిన దర్శకులందరి కంటే ఎక్కువ రాత్రనక పగలనక కష్టపడ్డారు. అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *