సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎప్పుడు పాలకొల్లు నియోజకవర్గములో చైతన్యవంతంగా ఉండే తెలుగు దేశం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ను నేడు, మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. పశ్చి మగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ – పెరుగులంక గ్రామాల్లో దళితుల భూముల్లో అధికార పార్టీ అండ చూసుకొని కొందరు అక్రమ మట్టి త్రవ్వకాలు చేస్తున్నారని ఆరోపిస్తూ అక్కడ ఎమ్మెల్యే రామానాయుడు ఆందోళన చేపట్టారు. నిన్న రాత్రి నుండి చించినాడ గోదావరి ఏటిగట్టుపైనే నిద్రించి వినూత్నంగా నిరసన తెలిపారు. ఇవాళ స్థానిక టీడీపీ నేతలతో కలిసి ఆందోళనకు సిద్ధమవుతుండగా గోదావరి ఏటిగట్టు ప్రాంతానికి చేరుకున్న పోలీసులు అక్కడున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. ఎమ్మె ల్యే అరెస్టు సమయం లో టీడీపీ నేతలకు పోలీసులకు మధ్య ఎప్పటిలాగే కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుం ది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *