సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫాన్‌గా బలపడింది. దానా తుఫాన్ తీరం వైపునకు దూసుకొస్తోంది.దీని ప్రభావంతో గోదావరి జిల్లాలో చలిగాలులు తో కూడిన చెదురుమదురు వర్షాలు నేడు, గురువారం కూడా కొనసాగాయి. అలాగే ఎండ కూడా తీవ్ర స్థాయిలో ఉంది. ఏపీపై దానా తుఫాన్ స్వల్ప ప్రభావం చూపుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరకోస్తాలో, గోదావరి జిల్లాలో ఉరుములతో కూడిన జల్లులు, భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దానా తుఫాన్ తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ప్రధాన పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. అయితే నేడు, గురువారం దాన తుపాను అర్థరాత్రి పూరి-సాగర్‌ ఐలాండ్ దగ్గర తీరందాటనుంది. తీరందాటే సమయంలో 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. దానా ప్రభావం కోస్తా ఆంధ్ర తో పాటు ఒడిశా-బెంగాల్‌ రాష్ట్రాలపై తీవ్రంగా పడింది. ఒడిశాలోని పారాదీప్‌లో అత్యధికంగా 62 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటికే తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లోని 14 జిల్లాలకు చెందిన 10 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *