సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతంలో వాయుగుండం బలపడటం తో ఇప్పటికే కోస్త ఆంధ్ర అంతటా నేడు, సోమవారం ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు రానున్న 48 గంటల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీనితో నదులు కాలువలు ఏరులు ప్రమాద భరితంగా ప్రవహించడంతో ప్రజలు మరింత చెందుతున్నారు.నేడు, సోమవారం సాయంత్రానికి ఉత్తర ఒడిస్సాలో పూరి – పశ్చిమ బెంగాల్ ప్రాంతంలోని డేగ అల మధ్య వాయుగుండం తీరం దాటనుంది. కోస్తాలో తీరం వెంబడి 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కళింగపట్నం, భీమిలి, విశాఖ, గంగవరం కాకినాడ రేవుల్లో మూడవ ప్రమాదక హెచ్చరిక జారీ చేసారు. . గత దశాబ్దంలో ఎప్పుడు లేనట్లు ఏపీలో వరదలకు ఎక్కువ స్థాయిలో పంటలు ఆస్తులు నష్టం ప్రాణ నష్టం జరగటం గమనార్హం.
