సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దాన తుపాను ప్రభావం ఏపీలో కేవలం ఉత్తరాంద్ర లోని కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం తో ఏపీ వాసులు రైతులు ఊపిరి తీసుకొన్నారు, ఒడిశాలోని భద్రక్ జిల్లాలోని ధామ్రాలో అర్ధరాత్రి 12:45 గంటలకు దానా తుఫాను తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్లోని పలు జిల్లాల్లో బలమైన గాలులు వీస్తున్నాయి. అలాగే భారీ వర్షం కురుస్తోంది.. ప్రస్తుతం నేడు, శుక్రవారం ఉదయం ఒడిశా, బెంగాల్లో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి.. ఒడిశాలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. తుపాను కారణంగా బెంగాల్, ఒడిశాలో 300 విమానాలు, 552 రైళ్లు రద్దు చేశారు.ఏపీ, యానాం, రాయలసీమలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
