సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తుపానులు రాకముందే పశ్చిమ గోదావరి జిల్లాలో రహదారులు అద్వానంగా ఉన్నాయి దానికి తోడు అర్నబ్, మురసు తుఫాన్ల ధాటికి ఆర్అండ్బీ రహదారులు మరింత దెబ్బ తిన్నాయి. జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలో అయితే టౌన్ రైల్వే స్టేషన్ దిగగానే గుంతలు పడిన రోడ్లతో అటు జేపీ రోడ్డు ఇటూ పిపి రోడ్డు లు ఎటువెళ్లిన ఇదేనా? తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి గాంచిన భీమవరం పట్టణం అని కొత్త వారికీ సందేహం రాక మానదు, చాల గ్రామీణ ప్రాంతాలతో పాటు, భీమవరం మండలంలో అనాకోడేరు వెళ్లే రహదారి అర కిలోమీటరు పొడవునా ఇప్పటికి వర్షపునీటితో మునిగి ఉంది. ఇక జిల్లాలో మిగతా పట్టణాలలో రోడ్ల పరిస్థితులు కాస్త అటుఇటుగా ఉన్నాయి. అయితే గోరు చుట్టుపై రోకలిపోటులా వరుసగా 2 తుపాను లు ప్రభావం ప్రత్యక్షంగా సముద్ర తీర ప్రాంతాలపై పట్టణాలపై ఎక్కువగా పడటంతో పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం మీద 678 కిలోమీటర్ల మేర రహదారులు పాడైనట్లు అధికారులు నివేదికలో పేర్కొన్నారు. అర్నబ్ తుఫాన్‌కు 552 కి.మీ వాటి అత్యవసర పనులకు రూ.52.78 కోట్లు, పూర్తిస్థాయిలో అభివృద్ధి రూ.299.55 కోట్లు మొత్తం రూ.352.33 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.ఈ ఎన్నికలు హడావిడి ముగిసాక అయిన కొత్తగా వచ్చిన ప్రభుత్వం, ప్రజాప్రతినిదులు ఈ రోడ్లపై ద్రుష్టి పెడితే మంచిది.
