సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ లోని మీడియాతో నేడు, బుధవారం బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. ఏపీలో జనసేన, బీజేపీ బంధంపై ఎలక్షన్లు దగ్గరపడే కొద్దీ మరింత స్పష్టత వస్తుంది. మరెవరినైనా కలుపుకోవాలా లేదా?అనే దానిపై భవిష్యత్తులో చర్చిస్తాం. జనసేన పొత్తుపై మాకెలాంటి కన్ఫ్యూజన్ లేదు. 175 నియోజకవర్గాలల్లో డిసెంబర్ నుంచి మా పార్టీ బలోపేతం చేసే పనిలో ఉంటాం.. తెలంగాణలో బీఆర్ఎస్‌ను ఓడించగల పార్టీగా బీజేపీ ఉంది.‘‘దిశ రాష్ట్ర స్ధాయి కమిటీ సమావేశం ఈరోజు జరిగింది. ఈ కమిటీలో కేంద్ర పథకాల అమలు గురించి చర్చించాం.. రైతుల‌ బీమా చెల్లించలేదని అధికారులే చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాను. తూర్పు కాపులకు OBC రిజర్వేషన్ ఇవ్వాలని NCBC నిర్ణయించింది. మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వస్తుంది. తూర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలని ప్రతిపాదించాను. రాష్ట్ర ప్రభుత్వం నుండి నివేదిక తెప్పించుకుని, కేంద్రం NCBC సమావేశం నిర్వహించింది’’ అని ఎంపీ జీవీఎల్ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *