సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేసారు. . కొడంగల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడుతూ .. ‘‘కొడంగల్‌లో రేవంత్ రెడ్డి పెద్ద భూకబ్జాదారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామంటున్నారు. రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేయలేదు. రేవంత్ నోరు తెరిస్తే గబ్బు.. ఆయన టికెట్లు అమ్ముకున్నారని కాంగ్రెస్ నేతలే అంటున్నారు. తెలంగాణ ఉద్యమకారులపైకి రేవంత్ తుపాకీ పట్టుకొని వెళ్లారు. కాంగ్రెస్ నేతలకు వ్యవసాయం గురించి ఏమీ తెలియదు. రేవంత్ రెడ్డి ఏనాడైనా వ్యవసాయం చేశారా? పొలం దున్నారా? అని ధ్వజమెత్తారు. ‘నీతి నియమం లేని వ్యక్తి రేవంత్ రెడ్డి. రూ.50 లక్షలతో మా ఎమ్మెల్యేలను కొంటూ పట్టుబడిన పెద్ద దొంగ. ఆయన తీరును ప్రజలంతా టీవీల్లో చూశారు. ఇవన్నీ చేసినా మళ్లీ సత్యహరిశ్చంద్రుడిలా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఇప్పుడు కొడంగల్‌లో సరిపోలేదని.. కామారెడ్డిలో నాపై పోటీకి వస్తున్నారు. రేవంత్ రెడ్డిని కొడంగల్‌లో చిత్తుగా ఓడించాలి. నేనే సీఎం అనేవాళ్లు కాంగ్రెస్‌లో 15 మంది ఉన్నారు. అయినా కాంగ్రెస్ గెలిస్తే కదా.. రేవంత్ సీఎం అయ్యేది. కొడంగల్‌లో పనిచేసే బి ఆర్ ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కావాలా? వట్టిమాటలు చెప్పే రేవంత్ రెడ్డి కావాలా? ప్రజలే తేల్చుకోవాలి అని కెసిఆర్ వ్యాఖ్యానించారు.
