సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో నేటి మంగళవారం సాయంత్రం 5గంటలతో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. 2023 సాధారణ ఎన్నికల ప్రచార ఘట్టం నేడు తేదీ నవంబర్-28న ప్రచారానికి తెరపడింది. వీధుల్లో మైకుల హోరు, ఇంటింటి ప్రచారం, పాటల సందడి ముగిసిపోయింది. స్థానిక ఓట్లు లేని స్థానికేతరులు నియోజకవర్గాలు విడిచి వెళ్లాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలల్లో 2,290 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 30వ తేదీన ఉదయం 7గంటల నుండి నిర్వహిస్తారు. అటు రేవంత్ రెడ్డి, ఇటు కేటీఆర్ లాంటి నాయకులు సుమారు 100 బహిరంగ సభలలోను అనేక డిబేట్లలో అలుపు సొలుపూ లేకుండా ప్రచారంలో పాల్గొన్నారు. సీఎం కెసిఆర్ సుమారు 50 సభలలో పాల్గొన్నారు. మిగిలిన కొద్ది గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అభ్యర్థులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ పక్రియ జరిగి విజేతలు ప్రకటింప బడతారు..
