సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణాలో జనసేన ముందుగా 32 సీట్లలో పోటీకి సిద్దపడినప్పటికీ బీజేపీ పెద్దలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రోద్బలంతో హోమ్ మంత్రి అమిత్ షా తో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపాక ఇరుపార్టీలు పొత్తుపై వెళ్ళితే జనసేన అవకాశం బట్టి తెలంగాణాలో కనీసం 20 స్థానాలలో పోటీ చేసేందుకు పవన్ అంగీకరించినట్లు తెలుస్తుంది. అయితే జనసేన పోటీ చేసే స్థానాలు ఆంధ్రప్రాంతం ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో పోటీ చెయ్యడానికి డిమాండ్ చెయ్యడం జరిగింది. దానితో జనసేన పొత్తు అంశం బీజేపీలో కొన్ని కీలక స్థానాలలో నేతలు క్యాడర్ లో ఆందోళన చెందుతున్నారు. పొత్తులో భాగంగా తమ స్థానాలు జనసేనకు ఇచ్చే ప్రసక్తేలేదని బీజేపీ అభ్యర్థులు తేల్చి చెబుతున్నారు. ముఖ్యము గా ఆంధ్రా లోని గోదావరి వాసులు ఎక్కువగా ఉండే శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి సీట్లు జనసేనకు కేటాయిస్తారంటూ బీజేపీలో జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో స్థానిక బీజేపీ నేతలు వేర్వేరుగా సమావేశమై అధిష్టానానికి తమ అభ్యన్తరాలు తెలిపినట్లు తెలుస్తోంది. శేరిలింగంపల్లి టిక్కెట్‌ను జనసేన ఇవ్వడాన్ని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో కీలకమైన శేరిలింగంపల్లి సీటు,బీజేపీ నేత రవికుమార్ యాదవ్ కోసం కొండా పట్టుపడుతున్నారు.మరోవైపు కూకట్‌పల్లి సీటును జనసేనకు ఇచ్చే ప్రతిపాదనను మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ బలమైన బీజేపీ క్యాడర్ ను నిరాశపరచవద్దని విజ్ఞతతో ఆలోచించాలని అధిష్టానాన్ని ఆయన కోరుతున్నారు. ఇంకా పలు సీట్లలో బీజేపీ అభ్యర్థులు ససేమిరా అంటున్నారు.
