సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను నేడు, సోమవారం మధ్యాహ్నం ప్రకటించింది. తెలంగాణ, ఛత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్, మిజోరం, రాజస్థాన్ రాష్ట్రాలు ఉన్నాయి. కాగా తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 3న ఎన్నికల ఓట్ల కౌంటింగ్ జరిగి ఫలితాలు ప్రకటిస్తారు. రాష్ట్రంలో తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో శంకుస్థాపనలు, ఆవిష్కరణలు ఆగిపోనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసుకోనున్నాయి. కాగా నేడు సోమవారం ఉదయం కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి 4 కొత్త రైళ్లను ప్రారంభించి ఊపిరి తీసుకొన్నారు. కాగా రాజస్థాన్‌కు నవంబర్ 23న పోలింగ్ జరగనుండగా మధ్యప్రదేశ్‌లో నవంబర్ 7న పోలింగ్ మిజోరంలో నవంబర్ 7న ఓటింగ్ జరగనుంది. ఇక చత్తీష్‌గఢ్‌లో 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో నవంబర్ 7న, రెండవ దశలో నవంబర్ 17న జరగనున్నాయి. ఇక అన్ని రాష్ట్రాలకూ డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
