సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పుష్ప 2 రిలీజ్ సమయంలో ఒక మహిళా మృతి నేపథ్యంలో తదితర పరిణామాలు తరువాత సినీ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి ని కలసి సన్మానించి నప్పటికీ .. తెలంగాణ ప్రభుత్వం తెలుగు నిర్మాతలకు షాక్ లమీద షాక్ లు ఇస్తుంది. రేవంత్ రెడ్డి ప్రజలు రక్షణ కన్నా సినిమా వాళ్ళు గొప్పవాళ్లు కాదు అన్న స్లోగన్ కు కట్టుబడిపోయారు. బెనిఫిట్ షోలు, అదనపు టికెట్ ధరలు నిషేదించారు. ఒకవైపు సంక్రాంతి పండగ సందర్భంగా ‘గేమ్ ఛేంజర్’, ‘డాకు మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి అగ్ర హీరోల భారీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ పంక్షన్స్, హీరోల అభిమానుల సంబరాలకు సైతం పోలీసులు నిషేదించారు.. ప్రధానంగా ‘గేమ్ ఛేంజర్’ మూవీ రిలీజ్ నేపథ్యంలో సంధ్య 35mm థియేటర్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి డీజేలు, బ్యానర్లు, డప్పులు, క్రాకర్స్, పూల దండాలు, కటౌట్లు పెట్టేందుకు వీలు లేదని ఆదేశించారు. హైదరాబాద్ లో సినిమా కు సంబంధించి ఎలాంటి చిన్న సెలబ్రేషన్స్ అయినా పోలీసుల నుండి అనుమతి పొందాలి. అలాగే ఎలాంటి ఘటనలు జరిగిన నిర్వాహకులే పూర్తి వహిస్తామని డాక్యుమెంట్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది. విచిత్రంగా సినిమా పెద్దలు” మమ్మలను ఎవరు అడ్డుకోనేది..సినిమా హీరోలను ఇలా అవమానిస్తారా ? అని ఎవరు రేవంత్ రెడ్డి సర్కార్ ఫై ఒక్క మాట అనే సాహసం చెయ్యడం లేదు..
