సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: తెలుగు అతి ప్రాచీన బాషా అని చాటిచెప్పడానికి తాజగా దొరికిన తిరుగులేని సాక్ష్యం,, క్రీస్తుశకం,575 సంవత్సరాల తెలుగు భాష ప్రాచీన ఆధారాలు లభించడం పట్ల భీమవరం లో స్థానిక పంక్షన్ హాలులో జరిగిన తెలుగు భాషాభిమానుల సదస్సు హర్షం వ్యక్తం చేసింది. దీనిలో ప్రముఖ తెలుగు వ్యాఖ్యాత చెరుకువాడ వెంకటరామయ్య అధ్యక్షత వహించి మాట్లాడుతూ శతాబ్దాల కాలంనాటి తెలుగు భాష అతి ప్రాచీన భాషగా నిలిచిందని ప్రపంచంలో గుర్తింపు పొందిన తెలుగు భాష అపూర్వమైనదని మనం తెలుగువారిగా తెలుగు జాతి గర్వించదగ్గ విషయమని అన్నారు. కలిగొట్ల గోపాల్ శర్మ మాట్లాడుతూ.. క్రీస్తుశకం,575 , వైఎస్ఆర్ జిల్లా ,కలమల్ల ప్రాంతం లో ధనుంజయుడు అనే చక్రవర్తి పరిపాలనలో తొలి తెలుగు భాషా శాసనం నిర్మితమైనదని, 60 ఏళ్ల నిరీక్షణ పరిశోధన లో , ఈనాటికి ఆధారం కనుగొనడం అనేది తెలుగు జాతి గర్వించదగ్గ విషయమని అన్నారు.నాచు శ్రీవల్లి మాట్లాడుతూ1వ శతాబ్దంలో హాలుడు రచించిన గాధాసప్తశతి అనే గ్రంథంలో తొలి తెలుగు పదాలు ఉండటం విశేషంఅలాగే 848లో పండరంగడు రచించిన గ్రంథంలో “పట్టంబు గట్టి ప్రధమంబు నేడు బల బోప్పంగ” అనే తొలి తెలుగు పద్యాన్ని రచించడం జరిగింది. ఇవన్నీ కూడా శాసనాలు ఆధారంగానే జరుగుతున్నాయి.ఇకపై, తమిళంలా బాషా లాగే కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా తెలుగు భాషను ప్రాచీన భాషగా ప్రకటించాలని కోరారు.
