సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మరోసారి అక్కినేని నాగార్జున హోస్ట్ గా స్టార్ మా ఛానెల్లో త్వరలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 సందడి ప్రారంభం కానుంది. గతంలో సెలబ్రిటీలు పేరుతొ భారీ హౌస్ సెట్లో అనామకులును దించేస్తుండటంతో షో ఫై ప్రేక్షకుల ఆసక్తి తగ్గిపోవడం గమనించిన బిగ్ బాస్ నిర్వాహకులు ఈ 7వ సీజన్ లో ఆ తప్పును సరిదిద్దుకొంటునట్లు సమాచారం. వచ్చే సెప్టెంబర్ ప్రారంభం కోబోతున్న బిగ్ బాస్ సీజన్ 7లో ఈసారి హోసే లోకి వెళ్లబోయేది వీరేనంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. . వీరిలో బుల్లితెర సీనియర్ నటుడు ప్రభాకర్, నటి, సురేఖా వాణి, నటి శోభా శెట్టి, యూట్యూబర్, నటి శ్వేతా నాయుడు, సింగర్స్ సాకేత్, మోహన భోగరాజు, బుల్లితెర జంట అమర్దీప్- తేజస్విని, టిక్ టాక్ దుర్గారావు దంపతులు, సినీ నిర్మాత,జర్నలిస్టు కొండేటి సురేశ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిలో ఒకరిద్దరు చివర్లో మిస్ అయినా మిగతా అందరూ దాదాపు షోలో ఎంట్రీ ఇవ్వడం ఖాయం అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *