సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాలంలో కొద్దీ రోజుల క్రితం బాగా తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ భారీగా పెరిగాయి. దసరా నవరాత్రులు, దీపావళి పర్వదినానికి ముందు పసిడి ధరలు పెరుగుతుండటంతో అందరి దృష్టి బంగారం ధరలపై పడింది. తాజాగా బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నేటి ఆదివారం (29 సెప్టెంబర్ 2024) ఉదయం నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.70,950 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.77,400 లుగా ఉంది. వెండి కిలో ధర రూ.95,500గా కొనసాగుతుంది. కాగా.. తెలుగు రాష్ట్రాలలో ధరలు ఎలా ఉన్నాయంటే.. ..హైదరాబాద్‌లో , విజయవాడ, వైజాగ్ లో కూడా 22 క్యారెట్ల బంగారం ధర రూ.70,950, 24 క్యారెట్ల ధర రూ.77,400 గా ఉంది. ఇక వెండి విషయానికి వస్తే హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.101,100, విజయవాడ, విశాఖపట్నంలో రూ.101,100లుగా ఉంది. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.95,000, ముంబైలో రూ.95,000, బెంగళూరులో రూ.99,990, చెన్నైలో రూ.101,100 లుగా ఉంది.
