సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో ఈ వేసవి వర్షాలతో మిక్స్ అయ్యి విచిత్రమైన వాతావరణం తో ప్రజలు ఆపసోపాలు పడుతున్నారు. మార్చి నెల 3వ వారం నుంచి ఇప్పటి వరకు ఉపరితల ద్రోణి, ఆవర్తనాల ప్రభావం కొనసాగుతోంది. గత మూడు వారాల నుంచి ఏపీలోలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండ సుర్రుమనిపించే వడగాలులతో పాటు ప్రతి రోజు అక్కడక్కడా వర్షాలతో పాటు అప్పు డప్పు డు ఈదురు గాలులు, ఉరుములు, పిడుగులు తో వర్షాకాలం తలపిస్తుంది, సాధారణంగా ద్రోణి, ఆవర్తనాలు ఏర్పడితే 4 రోజులు లేదా వారం రోజుల పాటు ప్రభావం చూపుతాయి.కానీ.. ఈసారి మూడు వారాలు దాటినా అవి బలహీన పడకుండా కొనసాగుతూనే ఉన్నాయి. ఇందుకు ఉత్తరాదిలో పశ్చిమ అసమతుల్యతలు ఏర్పడటం వల్ల అటు నుంచి చల్లని పొడిగాలులు వస్తున్నాయి. ఇటు బంగాళాఖాతం వైపు నుంచి తేమతో కూడిన దక్షిణ, ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమల మీదుగా కొనసాగుతుండటం వల్ల ఆయా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం నుంచి తేమ గాలులు నిలిచిపోయే వరకు ద్రోణి, ఆవర్తనాలు మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉందన్నారు వాతావరణ శాస్త్రవేతలు.
