సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అసలు సిసలు తెలుగు సంస్కృతీ , హైందవ సంప్రదాయాలు చాటి చెప్పేలా ముత్యాల ముగ్గులు, చిన్నారుల కోలాహలం, శ్రీ కాణిపాక గణపతి, విజయవాడ కనకదుర్గ, తిరుపతి వెంకన్న దర్శనాల కలగలుపు గా తెలుగు దనం ఉట్టిపడే పంచె కట్టు , కండువా తో నుదుట కుంకుమ ధరించి ముఖ్య మంత్రి జగన్,తో తలపాపిడి వద్ద కుంకుమ ధరించి పచ్చని పట్టు చీర ధరించిన భారతి దంపతుల ఇంట సంక్రాంతి సంబరాలుఅంబరాన్ని అంటాయి. సీఎం జగన్ ప్రతి ఏటా ప్రత్యేక సెట్ ఏర్పాట్ల మధ్య రైతులు, పల్లె ప్రజలతో, చిన్నారులతో కలిసి ఏటా సంక్రాంతి వేడుకలు నిర్వహిం చుకోవడం సీఎం జగన్ కు ఆనవాయితీగా వస్తోంది. తొలుత సీఎం వైఎస్ జగన్, భారతమ్మ దంపతులు భోగి మం టలు వేయటం తో పండుగ సంబరాలు మొదలయ్యాయి. అనంతరం గంగిరెద్దు బసవన్న లకు సారెను సమర్పించారు. అనంతరం గోపూజ కార్యక్రమం లో వారిరువురూ పాల్గొన్నా రు. ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుల ప్రదర్శనలు కూడా ఏర్పాటుచేశారు.
