సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆస్కార్‌ అవార్డ్‌ ప్రమోషన్స్‌ కోసం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌.’ చిత్రబృందం చేసిన ఖర్చుతో ఎనిమిది చిత్రాలు తీయవచ్చు’ అని సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ( చిరంజీవి కెరీర్ ప్రారంభంలో ‘మొగుడు కావాలి’ 175 రోజులు ఆడిన సినిమా తీసిన నిర్మాత దర్శకుడు..) గత గురువారం చేసిన వ్యాఖ్యలుఫై మెగా బ్రదర్ నాగబాబు పరుషజాలంతో స్వాందిస్తూ .. అసలు నువ్వు ఎన్ని సినిమాలు తీశావు? వాటిలో హిట్లు ఎన్ని? పెద్ద మేధావిలా నీ విశ్లేషణలు ఏమిటి?.. 80 కోట్లు అయ్యిందా? ‘ఆ డబ్బు నీ .. మొగుడు ఇచ్చాడా? అని మెగా సోదరుడు నాగబాబు మరో ప్రక్క దానిని ఖండిస్తూ కే రాఘవేంద్ర రావు ‘తెలుగు సినిమా, సాహిత్యం, దర్శకుడు, నటీనటులకు మొదటిసారి ప్రపంచ వేదికలపై వస్తున్న పేరు, ప్రఖ్యాతలను చూసి గర్వపడాలి. అంతేకానీ, రూ. 80 కోట్లు ఖర్చు అని చెప్పడానికి మీ దగ్గర లెక్కలు ఏమన్నా ఉన్నాయా?’ అని ప్రశ్నించడం తో తెలుగు రాష్ట్రాలలో మరో “RRR” మాటల యుద్ధం మొదలయింది. సోషల్‌ మీడియాలో దీనికి ఇరువర్గాలకు అనుకూలంగా, వ్యతిరేకంగా పోస్టులు తీవ్ర స్థాయి విమర్శల రచ్చ మొదలయింది. విమర్శలపై భరద్వాజ కూడా మెత్తగా మాట్లాడుతూ తీవ్రంగా స్పందించారు. నేను ‘రెండున్నర గంటల పాటు రాజమౌళి RRR సినిమా గొప్పతనం గురించి మాట్లాడితే అది వదిలేసి నిముషం ఉన్న వీడియో క్లిప్‌ చూసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అవసరానికి ,ఎవరో కాళ్ళు పట్టుకొని పదవులు, స్వంత పనులు చేయిందుకొనే మీకు పబ్లిసిటీ కావాలి 75 ఏళ్ళు వచ్చిన నాకెందుకు? మీ ఎవరి కాళ్ళు పట్టుకొని ఎంతకు దిగజారతారో నేను చెప్పగలను. అయితే మన సినిమా ఇండస్ట్రీ పరువు పోతుంది అని ఆగుతున్నాను. నా తండ్రిని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. నేను కూడా అదే స్థాయిలో అదే భాషతో రియాక్ట్‌ కాగలను. . కానీ నాకు నా తండ్రి ఇచ్చిన సంస్కారం ఉంది. ఈ వివాదాన్ని కొనసాగించాలన్న ఉద్దేశం కూడా లేదు.’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *