సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇక హిందీలో కూడా ఖాన్ హీరోల స్టార్ డమ్ ఇమేజ్ మసకబారిపోయింది. ఒక ప్రక్క బాహుబలి ప్రభాస్ మరో ప్రక్క ఎన్టీఆర్, రామ్ చరణ్ లు, చిన్న యువ హీరోలు సైతం ‘పాన్ ఇండియా సినిమాలతో’ ఉత్తరాదిన అద్భుతాలు చేస్తున్నారు. ఇటీవల తాజగా అల్లు అర్జున్ పుష్ప సినిమా తో ఇక బాలీవుడ్ మొత్తం ఉత్తర భారత దేశం అంతా నాన్ స్టాప్ గా రికార్డ్స్ లేపెయ్యడంతో ఇక బాలీవుడ్ స్టార్ హీరోల తిరోగమనం ప్రారంభమయింది. ఇప్పటికి వరకు షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ , సల్మాన్ ఖాన్ చాలా ఏళ్లుగా బాలీవుడ్ ని శాసిస్తున్నారు. గత 5 ఏళ్లుగా ప్లాప్ లలో మునిగిపోయారు. ఇందులో ఇటీవల కాస్త షారుక్ ఖాన్ జవాన్ వంటి హిట్ తో తేరుకొన్నాడు. అయితే తెలుగు సినిమా పాన్ ఇండియా ప్రభంజనాన్ని ఎదోరకముగా అడ్డుకోవాలని బాలీవుడ్ ప్రముఖుల ప్యూహాలు వేగవంతం అవుతున్నాయి. ఇక ఖాన్ హీరోలు చెయ్యి చెయ్యి కలపాలని నిర్ణయించారు. ఒక భారీ మల్టి స్టార్ బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టి తీరవలసిందే అని నిర్ణయించారు. ఈ కోరిక త్వరలో నెరవేరనుందని తెలుస్తోంది. అలాగని ఇది గాసిప్ కాదు. ఈ విషయాన్ని స్వయంగా ఆమిర్ ఖాన్ ప్రకటించాడు. సౌదీ అరేబియాలో జరుగుతున్న రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అమిర్ ఖాన్ మీడియాతోమాట్లాడుతూ ‘‘నేను ఆరు నెలల క్రితం షారుక్‌, సల్మాన్‌ ఖాన్‌లను కలిశాను. ఆ సందర్భంగా ఈ మల్టి స్టార్ సినిమాపై చర్చించుకున్నాం. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ కూడా నాతో ఏకీభవించారు.’ త్వరలో ప్రాజెక్టు సిద్ధం చేస్తామని అని ఆమిర్ ఆశాభావం వ్యక్తం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *