సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: యూపీలోని మహా కుంభమేళా.. ఆపై మౌని అమావాస్యఇవాళే ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానం ఆచరించాలన్నది భక్తుల ఆరాటం. అందులోనూ సంగం ఘాట్‌కు వెళ్లాలన్న ప్రయత్నం. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. వందలాది బ్యాగ్ లు చెప్పులు, సామాను అక్కడ చెల్లచుదురుగా పడివున్నాయి. మహాకుంభ్ సంగం ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో సుమారు 30 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం.. సంగం ఘాట్ దగ్గర విపరీతమైన రద్దీతో క్యూలైన్‌లో ఒక్కసారిగా తోపులాట జరిగింది.. బారికేడ్ విరగడంతో పక్కనే నిద్రిస్తున్నవారిపై జనం పడిపోయారు. తొక్కిసలాట, హాహాకారాలతో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాట ఘటన, ప్రస్తుత పరిణామాలపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కుంభమేళాలో జరిగిన దుర్ఘటన బాధాకరం అంటూ పేర్కొన్నారు. తమ కుటుంబసభ్యులను కోల్పోయిన భక్తులకు తన సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. బాధితులకు సాధ్యమైనంతగా అధికార యంత్రాంగం సాయం చేస్తోందన్నారు.యూపీ సీఎం యోగితో మాట్లాడుతున్నానని మోదీ చెప్పారు.
