`సిగ్మాతెలుగు డాట్, ఇన్,న్యూస్: వీరవాసరం మండలం తోకలపూడి గ్రామంలో 32.2 లక్షల రూపాయలతో తోకలపూడి నుండి తోకలపూడి పాలెం వరకు కొత్తగా నిర్మిస్తున్న బిటి రోడ్డుకు నేడు, సోమవారం స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ శంకుస్థాపన చెయ్యడం ఈ కార్యక్రమం లో విశేషంగా స్థానిక ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గోవడం జరిగింది. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ ఫలాలు అందరికి అందుతున్నాయా? లేకపోతే ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని స్థానిక మహిళలను అడిగి తెలుసుకొన్నారు. తదుపరి, జొన్నలగరువు గ్రామంలోని క్రీస్తు లూథరన్ చర్చ్ లో టవర్ ను ప్రారంభించి వారికీ, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. వీరవాసరం మండలం లో పలు శుభకార్యాలలో కూడా అయన పాల్గోవడం జరిగింది. `
