`సిగ్మాతెలుగు డాట్, ఇన్,న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ధరల్ని ప్రభుత్వం ఒక్కసారిగా 15 నుంచి 20 శాతం తగ్గించిన నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద భారీగా మందుబాబులు చేరుకొని అమ్మకాలను భారీగా పెంచేశారు. బ్రాండ్‌ను బట్టి క్వార్టర్‌ పై కనీసం 20 నుంచి 50 వరకు, ఫుల్‌బాటిల్‌పై 120 నుంచి 200 వరకు తగ్గించింది. అన్ని రకాల బీర్లపై రూ. 20 నుంచి 30 వరకు ధర తగ్గిస్తూ ప్రభుత్వనిర్ణయం నిన్న ఆదివారం నుంచి అమలు కావాల్సివుండగా కొత్త రేట్ల పట్టిక దుకాణ సూపర్‌వైజర్లకు ఆదేశాలు అందక పోవడంతో ఉదయం నుంచి దుకాణాలను మూసివేశారు. దానితో మందుబాబులు లో తీవ్ర నిరాశ కలిగింది. అయితేసవరించిన రేట్లు ఆన్‌లైన్‌లో నందు నమోదుకావడంతో ఎట్టకేలకు 3 గంటల సమయానికి సవరణ పూర్తవడంతో దుకాణాలు తెరుచుకున్నాయి.ఇక అప్పటి నుండి నేటి, సోమవారం ఉదయం వరకు మద్యం దుకాణాల వద్ద క్యూ లైన్లు తగ్గితే ఒట్టు.. `

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *