సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ఇటీవల టమాటా తో పాటు క్యాబేజి ధర బాగా దిగివస్తుంది. టమాటా ధర కేజీ 18-20 రూపాయలకు కేబేజి ఒకొక్కటి కేజిన్నర ఉండే పెద్ద సైజు 20-25 కు రిటైల్ గా అందుబాటులో ఉంటె తమిళనాడులో రిటైల్ కేవలం 5 రూ కు అందుబాటులో ఉంది. తమిళనాడు లోని ఈరోడు జిల్లా తాళ్ళవాడి గ్రామంలో వేలాది ఎకరాలలో క్యాబేజి సాగుకు ప్రసిద్ధి.. సకాలంలో వర్షాలు కురవడంతో ఈ ఏడాది దిగుబడి పెరిగింది. ఈ నేపథ్యంలో, కొద్ది రోజులుగా క్యాబేజీ కిలో రూ.10 నుంచి రూ.20 వరకు ఉండగా, ప్రస్తుతం కిలో రూ.2కు పడిపోయింది. హోల్ సెల్ గా క్యాబేజీ కిలో రూ.2కు పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కొసే ఖర్చులు కూడా రావని అలానే పంట వదిలేసే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించి క్యేబిజి రైతులను ఆదుకోవాలని అక్కడ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీని ప్రభావం తో ఏపీలో కూడా క్యాబేజి ధర మరింత తగ్గే అవకాశం ఉంది.
