సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: తెలుగు సినీ పరిశ్రమలో 2ఏళ్ళకొకసారి జరిగే అత్యం త ప్రతిష్టాత్మ కమైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్సీసీ)ఎన్ని కలు నేడు, జరిగాయి. సుమారు 1600 మంది సభ్యులు ఉన్న ఈ ఎన్నికల ఓటింగ్ ఉదయం 8 గంటల నుంచి మధ్యా హ్నం 4 గం టల వరకు జరిగింది. మొత్తం 1339 ఓట్లు పోలైయ్యా యి తదుపరి కౌంటింగ్ ప్రారంభయ్యింది. ఫలితాలు ప్రకటించారు.ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ప్రొడ్యూ సర్ సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సే క్టార్, స్టూడియోసెక్టార్, ఎగ్జిక్యూ టివ్ సెక్టార్.. ఇలా దాదాపు 12విభాగాలు ఉంటాయి. వీటిలో నిర్మాతల విభాగం లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్యానెల్ నుంచి పోటీచేసిన 12 మందిలో ఏడుగురు గెలుపొందారు. విజేతలు అయిన నిర్మాతలు గా దిల్ రాజు , దామోదర ప్రసాద్, మోహన్ వడ్లపాటి, స్రవంతి రవికిశోర్, పద్మిని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ గౌడ్ గా ప్రకటించారు. డిస్ట్రిబ్యూషన్ విభాగంలో దిల్ రాజు, సి కళ్యాణ్ ల ఇరు ప్యానెల్ నుంచి సమానంగా ఆరుగురి చొప్పున గెలుపొందారు. స్టూడియో సెక్టార్లో నలుగురికి గాను దిల్రాజ్ ప్యా నెల్ నుంచి ముగ్గురు గెలుపొందారు. మొత్తం 14 రౌండ్లలో ప్రెసిడెంట్ పదవికి పోటీ పడిన దిల్ రాజు కు 563 ఓట్లు వచ్చా యి. సి.కల్యా ణ్ ప్యా నెల్ కు497 ఓట్లు వచ్చా యి.
