సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశీయ స్టాక్ మార్కెట్లునేడు శుక్రవారం (జులై 27న) ఉదయం 10.30 గంటల సమయంలో సెన్సెక్స్(sensex) 507 పాయింట్లు లాభపడి 80,547 స్థాయిలో ఉండగా, నిఫ్టీ(nifty) 180 పాయింట్లు వృద్ధి చెంది 24,585కి చేరుకుంది. కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం లాభాలకు విరుద్ధంగా 140 పాయింట్లు నష్టపోయి 50,747 పరిధిలో ఉంది. రెండో త్రైమాసికంలో US ఆర్థిక వ్యవస్థ 2.8 శాతం వృద్ధిని సాధించింది.ఈ సానుకూల ధోరణి సహా పలు అంశాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా లాభాల దిశగా కొనసాగుతున్నాయి.ఈ క్రమంలోనే ప్రస్తుతం భారతి ఎయిర్‌టెల్, దివిస్ ల్యాబ్స్, శ్రీరామ్ ఫైనాన్స్, LTIMindtree, ఇన్ఫోసిస్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉండగా, టెక్ మహీంద్రా, HDFC బ్యాంక్, TATA కంన్జూమర్స్, ONGC, నెస్లే సంస్థల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి. దీనితో గత గురువారం నష్టాలలో ఉన్న స్టాక్ మార్కెట్ నేడు వారాంతంలో పుంజుకొంది.
