సిగ్మాతెలుగు డాట్, న్యూస్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు లో నేడు, శనివారం సీఎం జగన్ పర్యటించారు, మూడో విడత వైఎస్‌ఆర్ ఆసరా నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి శనివారం లబ్ధిదారుల ఖాతాలో బటన్ నొక్కి జమ చేశారు. 78.94 లక్షలమంది లబ్ధిదారులకు రూ 6,419 కోట్లు విడుదల చేశారు. భారీ బహిరంగ సభలో మహిళలను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడారు. మహిళా సాధికారతే లక్ష్యంగా వైసిపి ప్రభుత్వం ముందుకెళ్తోందని స్పష్టం చేశారు. మహిళలపై వడ్డీ భారం పడకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బ్యాంకులతో మాట్లాడి వడ్డీ శాతం తగ్గిస్తూ వస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం పొదుపు సంఘాల పనితీరు ఎలా మారిందో కనిపిస్తోందన్నారు. 91శాతానికి పైగా సంఘాలు ఏ గ్రేడ్ సంఘాలుగా మార్పుచెందాయని సీఎం జగన్ ప్రకటించారు,ఈ కార్యక్రమంలో ఎంపీ, కోటగిరి శ్రీధర్ మంత్రులు కారుమూరి, రోజా, విశ్వరూప్ ఎమ్మెల్యేలు అబ్బయ్య చౌదరి, ఆళ్ల నాని ఏలూరు జిల్లా ఎమ్మెల్యేలు వైసిపి ప్రజాపతినిధులు పాల్గొన్నారు,
