సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టరు నిమ్మల రామానాయుడు తన పాలకొల్లు నియోజకవర్గంలోని యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామంలో గోదావరి ఏటిగట్టు వరద ముంపు నివాసియుల ప్రాంతాన్ని పరిశీలించి, వరద బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, నిత్యవసర సరుకులను మంత్రి రామానాయుడు అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జగన్ సర్కార్ గత ఐదేళ్ల కాలంలో దొడ్డిపట్ల గ్రామంలోని గోదావరి ఏటిగట్టు నివాసిలకు చెందిన కాలనీలో కనీస మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందన్నారు.ఇక్కడ ప్రజలకు డ్రైన్లు,వీధి దీపాలు,రహదారులు వంటి కనీస సదుపాయాలు నోచుకోలేదన్నారు. రానున్న కాలంలో అన్ని మౌలిక వసతులతో మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. గత వైసిపి ప్రభుత్వంలో ఇటువంటి కష్టం వచ్చినప్పుడు రోజంతా నిరసన తెలిపితేనే గాని సాయం అందలేదని, నేడు ఎన్డీఏ ప్రభుత్వం వరద నీరు గుమ్మం ముందుకి ఇంకా రాకముందే సాయం అందిస్తున్నా మని చెప్పారు. గోదావరి ఏటిగట్టును గత వైసిపి ప్రభుత్వంలో ఇసుక కోసం మూడు అడుగులు ఎత్తును తగ్గించి రెండు లారీలు వెళ్లేలా చదును చేసి ప్రమాదకరంగా మార్చారన్నారు. అప్పట్లో జరిగిన తప్పిదానికి సహకరించిన అధికారులపై జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఏటిగట్టు పటిష్టతకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి రామానాయుడు తెలిపారు.
