సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:పాన్ ఇండియా సూపర్ స్టార్, ప్రభాస్‌ కల్కి’ ప్రపంచ వ్యాప్తంగా 1100 కోట్ల దిశగా అడుగులు వేస్తూ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈసారి చాల కాలం తరువాత రొటీన్ తెలుగు సినిమా మాస్ కామిడి పార్ములా తో సాధారణ బడ్జెట్ తో మారుతి దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీవారి నిర్మాణంలో ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘రాజా సాబ్‌’ చిత్రం నుంచి అప్డేట్‌ వచ్చింది. ఫ్యాన్‌ ఇండియా గ్లింప్స్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. డార్లింగ్ ప్రభాస్‌ సూటు వేసుకొని పూలబొకే తో వింటేజ్‌ లుక్‌లో ఛార్మింగ్‌గా కనిపించారు . రొమాంటిక్‌ హారర్‌ జానర్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే 40 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఆగస్టు 2 నుంచి మరో భారీ షెడ్యూల్‌ ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 10న రిలీజ్ చెయ్యనున్నారు. ఈ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ లుగా నిధి అగర్వాల్‌, మాళవికా మోహనన్‌, లు నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *