సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రిపబ్లిక్ డే సందర్భంగా 2025 పద్మశ్రీ అవార్డుల గ్రహీతల జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ నుంచి సినీ నటుడు నందమూరి బాలకృష్ణ,కు పద్మ భూషణ్ అవార్డు వరించింది. గత 50 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ఇప్పటికి అశేష అభిమానులను మెప్పిస్తున్న బాలయ్య కు కేంద్ర ప్రభుత్వ సత్కారం దక్కనుంది. తెలుగు రాష్ట్రాలలో బాలయ్య అభిమానులు టీడీపీ అభిమానులు లో ఆనందం రేకెత్తింది.మరో అచ్చమైన తెలుగు వాడు.. తమినాడు లో సూపర్ పామ్ లో ఉన్న అగ్ర హీరో అజిత్ కు కూడా పద్మభూషణ్ వరించింది. ఈసారి ముగ్గురు విదేశీయులను పద్మశ్రీ అవార్డులు వరించాయి. కువైట్ యోగా ట్రైనర్ అల్ సబాహ్, బ్రెజిల్‌కు చెందిన వేదాంత గురువు జోనాస్ మాసెట్, నేపాల్ జానపద గాయకుడు నరేన్ గురుంగ్‌ను పద్మ శ్రీ అవార్డులకు ఎంపిక చేసింది కేంద్రం. గోవాకు చెందిన వంద ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధుడు లిబియా లోబో సర్దేశాయ్‌ను పద్మశ్రీ అవార్డు వరించింది. తెలంగాణకు చెందిన మందకృష్ణ మాదిగ, వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి, మదుగుల నాగభూషణ్ శర్మ, మిరియాల అప్పారావు పద్మశ్రీకి ఎంపికయ్యారు.
