సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గూడూరి ఉమాబాల శరవేగంగా ఉత్సహ పూరితంగా ఇప్పటికే జిల్లా నలుమూలలా పర్యటిస్తూ ..ఒక వైపు వైసీపీ నేతలను కలుస్తూ మరో ప్రక్క పార్టీ కార్యక్రమాలలో , అనేక శుభకార్యక్రమాలలో పాల్గొంటు ప్రజలలో మమేకం అవుతున్నారు. భీమవరంలోని వైసీపీ లోక్ సభ కార్యాలయంలో ప్రతి రోజు ఉదయం కార్యక్రమాల వివరాలను ఆమె స్వయంగా నోట్ చేసుకోవడం విశేషం..ఆమె నేటి మంగళవారం ఉదయం నరసాపురం నియోజకవర్గం గొంది గ్రామపంచాయతీలో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టి స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు తోపాటు పాల్గోన్నారు. ఈ సంధర్భంగా ప్రతి గడప గడపకు వెళ్లి సీఎం జగన్ ప్రజలకు చేసిన సంక్షేమ అభివృద్ధిని వివరిస్తూ.. ఈ సంక్షేమం, అభివృద్ధి ఇలానే కొనసాగాలి అంటే రాబోయే ఎన్నికల్లో ఎం.పి మరియు ఎమ్మెల్యే రెండు ఓట్లను ఫ్యాను గుర్తుపై వేసి తమని ఆశీర్వదించాలని కోరుతున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో వివిధ సంఘాల నేతలు, వైసీపీ ప్రజాప్రతినిధులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *