సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం సాయంత్రం పార్టీ అధిష్టానం శుక్రవారం సాయంత్రం ఆరో జాబితాను విడుదల చేసింది. ఇందులో కీలకమైన ఎన్నో ఊహాగానాలకు అంచనాలకు నిలయమైన పశ్చిమ గోదావరి జిల్లా, నర్సాపురం ఎంపీ వైసిపి ఇంచార్జి గా బిసి సామజిక వర్గానికి చెందిన భీమవరం కు చెందిన గూడురి ఉమాబాల(అడ్వొకేట్) కు కేటాయించడం పెను సంచలనం రేపింది. ఇప్పటివరకు వైసిపి ఎంపీ టికెట్ ఆనవాయితీగా క్షత్రియ సామజిక వర్గానికి కేటాయిస్తారని భావించినప్పటికీ ఎవరు ఊహించని రీతిలో బిసి వర్గానికి అందులోను మహిళకు కేటాయించడం సీఎం జగన్ తీసుకొన్న సాహసోపేత నిర్ణయంగా భావించవచ్చు.. అటు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ప్రస్తుత ఎంపీ రఘురామా కృష్ణంరాజు బరిలోకి దిగుతారని ప్రచారం జారుతున్న నేపథ్యంలో ? ఆయనకు దీటుగా పోటీగా జిల్లా వైసీపీ మహిళా కాంగ్రెస్ అడ్జక్షురాలుగా , చిన్నతిరుమల గా ప్రసిద్ధి పొందిన ద్వారక తిరుమల దేవాలయం ట్రస్టీగా పనిచేసిన గూడూరి ఉమాబాల ను వైసిపి అధిష్టానం ఎన్నిక చెయ్యడం ఫై పార్టీలో ప్రస్తుతం భిన్న స్వరాలూ వినిపిస్తున్నప్పటికీ సీఎం జగన్ ప్యూహంలో అది భాగంగా భావించక తప్పదు.. ఇక అడ్వాకెట్ గా పనిచేస్తున్న గూడూరి ఉమాబాల తండ్రి పంపన చంద్రశేఖర్ పట్టణంలో ప్రముఖ లాయర్ గా పలుసారులు కౌన్సిలర్ గా పట్టణ వైస్ చైర్మెన్ గా పనిచేసారు.గూడూరి ఉమాబాల భర్త గూడూరి జగదీష్ విద్యావంతుడు , పలు కళాశాలలో ప్రొపెసరుగా పనిచేసిన అనుభవం ఉంది. గూడూరి ఉమాబాల కూడావిద్యావంతురాలు..గతంలో మునిసిపల్ కౌన్సిలర్ గా పనిచేయడమే కాకుండా భీమవరం పట్టణంలో 2 న్నర దశాబ్దాల క్రితం కాంగ్రెస్ చైర్ పర్సన్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందటం జరిగింది. ఆవిడ సోదరులు ఇతరాత్ర కుటుంబ నేపథ్యంలో ఎక్కువ మంది ప్రముఖ లాయర్లు కావడం గమనార్హం. అయితే వీరు అతి సంపన్న కుటుంబ నేపథ్యం మాత్రం కాదు.. మన సిగ్మా న్యూస్ తో( సిగ్మా ప్రసాద్) ఆమె ఫోన్ లో మాట్లాడుతూ.. ప్రస్తుతం తమ కుటుంబం ‘తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకొన్నాక తిరిగి వస్తున్నా తమకు ఈ శుభవార్త’ తెలిసిందని, స్వర్గీయ వై యస్ రాజశేఖర్ రెడ్డ్ తో కలసి జిల్లాలో కాంగ్రెస్ కు పనిచేశానని తదుపరి వైసిపి పార్టీ ఆవిర్భావం నుండి తాను మహిళగా చేసిన కృషిగా గుర్తింపుగా తనను ఎంపిక చేసిన సీఎం జగన్ కు పార్టీ పెద్దలకు కృతఙ్ఞతలు తెలుపుతున్నానని పార్టీలో అందరిని కలుసుకొని,ప్రజలలో అన్ని వర్గాలను కలుపుకొని కార్యాచరణ ప్రారంభిస్తామని హర్షం వ్యక్తం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *