సిగ్మాతెలుగు డాట్, ఇన్, న్యూస్: కేంద్ర ప్రభుత్వం తాజగా ఇచ్చిన ఆదేశాలతో గోదావరి జిల్లా ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నా … నరసాపురంలో వశిష్ఠ గోదావరిపై వంతెన నిర్మాణానికి మార్గం సుగమమైంది, అని ప్రభుత్వ ఛీప్‌విప్‌ , నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు తాజగా ప్రకటించారు.. కోనసీమ – పశ్చిమగోదావరి జిల్లాల్లోని తీరప్రాంత గ్రామాలను అనుసంధానం చేస్తూ వారధి నిర్మించాలని రామేశ్వరం – రాజుల్లంక గ్రామాల మధ్య గోదావరిపై వంతెన, ఇరువైపులా అనుసంధాన రోడ్ల నిర్మాణం, వాటికి కల్వర్టులు, కాలువలపై వంతెనలు నిర్మాణం చేపట్టనున్నారు. దీనికి అవసరమైన రూ.580.42 కోట్లు మంజూరు చేస్తూ కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో పనులు కడుతున్నాయి, 21.70 కి.మీ. మేర.. కోనసీమ జిల్లా దిండి సమీపంలోని 216 జాతీయ రహదారి నుంచి రామేశ్వరంలోని వంతెన నిర్మాణ ప్రాంతం వరకూ సుమారు 14 కి.మీ. మేర అనుసంధానంగా రహదారి నిర్మించనున్నారు. రాజుల్లంకలో వంతెన నిర్మించనున్న ప్రాంతం నుంచి లక్ష్మణేశ్వరం, వైఎస్‌పాలెం, సీతారామపురం మీదుగా 216 జాతీయ రహదారి వరకూ సుమారు 7.5 కి.మీ. మేరకు పదిమీటర్ల వెడల్పున రోడ్డు నిర్మించనున్నారు. ‘ఈపీసీ విధానంలో నిర్మాణ పనులు 24 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. కాంట్రాక్టు దారుల ఎంపికకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *