సిగ్మాతెలుగు డాట్, ఇన్, న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని నేడు, గురువారం దర్శించుకున్న స్థానిక భక్తులు శ్రీ పి టి శ్రీనివాస అయ్యర్ ఒక లక్ష వేయి నూట పదహారు రూపాయలు ను శ్రీ అమ్మవారి ఆలయంలో భక్తులకు ప్రతిరోజూ అన్నసమారాధన నిర్వహించే శ్రీ మావుళ్ళమ్మ వారి నిత్యాన్నదాన ట్రస్ట్ కు కానుకగా సమర్పించినారు. మరో భక్తుడు జస్వంత్ సూర్య వినాయక్ తన కుమారుడు యస్వంత్ వెంకట దుర్గా మణికంఠ పేర 8గ్రాముల బంగారాన్ని కానుకగా అందేజేసినట్లు దేవస్థానం సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రజీ తెలిపారు,
