సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత వారం చివరలో లాభాలలోకి వచ్చిన స్టాక్ మార్కెట్ సూచీలు నేడు, వారాంతంలో మొదటిరోజైన సోమవారం (డిసెంబర్ 2న) లాభాలతో మొదలై, క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే ఊహించని విధంగా మళ్లీ ఉదయం 10.20 గంటల నాటికి లాభాల్లోకి వచ్చాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 65 పాయింట్ల లాభంతో ట్రేడై 79,866 స్థాయిలో ఉండగా, నిఫ్టీ 38 పాయింట్లు పెరిగి 24,169 పరిధిలో ట్రేడవుతోంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 145 పాయింట్లు పడిపోవడం విశేషం. ఇక నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 270 పాయింట్లు పుంజుకుని 56,663 స్థాయికి చేరుకుంది. దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే వేల కోట్ల రూపాయలు లాభాలు సంపాదించారు. HDFC లైఫ్, ఇండస్ఇండ్ బ్యాంక్, సిప్లా, HUL, లార్సెన్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉండగా, గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, మారుతి సుజుకి, సన్ ఫార్మా సంస్థల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి.
