సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ పాకిస్తాన్ ల మధ్య యుద్ద మేఘాలు కమ్ముకొంటున్న నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ సూచీలు నేడు, శుక్రవారం (వారాంతం) నష్టాలలో ముగిశాయి. మార్కెట్లు నష్టాలతో ముగియడం వరుసగా ఇది రెండోరోజు. నేడు నిఫ్టీ 207.35 పాయింట్లు నష్టపోగా, సెన్సెక్స్ 588.90 పాయింట్లు పతనమైంది. అయితే, ఇవాళ కూడా ఐటీ స్టాక్స్ సూచీలు బాగా రాణించడం విశేషం. ఐటీ మినహా, మిగతా అన్ని రంగాలలో.. మీడియా, మెటల్, పీఎస్ యూ, టెలికాం, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, రియాల్టీ 2 నుంచి 3 శాతం క్షీణించాయి. యాక్సిస్ బ్యాంక్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, ట్రెంట్ నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. లాభపడిన వాటిలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్ ఉన్నాయి.యుద్ధ భయం నేపథ్యంలో పాకిస్తాన్ లో అయితే మొత్తం స్టొక్ మార్కెట్ అత్యంత దారుణంగా గత 3 రోజులుగా పతనం అయ్యింది.
